మోడల్ స్కూల్ ఆదర్శంగా నిలవాలి
గోస్పాడు: మోడల్ స్కూల్ అంటే ఫలితాలు, వస తుల్లో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్‌ను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు, తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆర్‌ఓ ప్లాంట్‌లో లీకేజీ సమస్యను గుర్తించి మరమ్మతులు చేయించాలని ప్రిన్సిపాల్ ఖాజా హుసేన్‌ను ఆదేశించారు. లైబ్రరీలో పుస్తకాలు తప్ప మిగతా సామగ్రి ఉంచొద్దని సూచించారు. పాఠశాలలో మిగిలిపోయిన స్కూల్ బ్యాగులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అ టల్ టింకరింగ్ ల్యాబ్‌లో రైటింగ్ ప్యాడ్ కుర్చీలు లేకపోవడంతో మండిపడ్డారు. ల్యాబ్ గదులన్నింటికీ తాళాలు వేయకుండా క్రమం తప్పకుండా వినియోగంలోకి తేవాలన్నారు.
భక్తులకు మెరుగైనవైద్య సేవలు అందించాలి
గోస్పాడు: శ్రీశైల పాదయాత్ర భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సక్రమంగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం బైర్లూటీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాలకు కేటాయించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు వైద్యసేవలు అందించాలని సూచించారు. తీవ్ర అస్వస్థతకు గురైన భక్తులు వస్తే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పాదయాత్ర భక్తులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment