మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ.59.87 లక్షలు
మహానంది: మహానందీశ్వరుడికి హుండీ ఆదాయం రూ.59.87 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని అభిషేకం మండపంలో గురువారం శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండ రామాలయం, వినాయక నంది ఆలయాల హుండీలతో పా టు అన్నదాత విభాగం, గోసంరక్షణ విభాగం హుండీ కానుకలను లెక్కించారు. ఆలయాల హుండీల ద్వారా రూ.58,56,681, అన్నప్రసాదం ద్వారా రూ.99,110, గోసంరక్షణ విభాగం ద్వారా రూ.31,317 వచ్చిందన్నారు. లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓ మధు, సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి, పలు ప్రాంతాలకుచెందిన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: శ్రీగిరిలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి వాడరేవు వినయ్ చంద్ పరిశీలించారు. సర్వదర్శనం, శీఘ్ర, అతి శీఘ్రదర్శన క్యూలైన్లు, పాగాలంకరణ, కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్యూలైన్ల నిర్వహణ పూర్తి ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాట జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. క్యూ కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, దేవస్థానం ఎం.శ్రీనివాసరావు ఉన్నారు.
మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ.59.87 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment