కర్నూలు (అగ్రికల్చర్): మార్చి 24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మె చేపట్టనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) నేత లు తెలిపారు. కర్నూలు గాయత్రి ఎస్టేట్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారపేట బ్రాంచ్ ఎదుట శుక్రవారం సాయంత్రం నిరసన కార్యక్రమాన్ని చేప ట్టారు. అన్ని బ్యాంకులకు చెందిన ఉద్యోగులు 400 మంది వరకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అన్ని కేడర్‌లలో తగిన ని యామకాలు చేపట్టాలని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐడీబీఐ ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు, ఉద్యోగులపై దాడులను అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐబీవోసీ నాయకులు జియాపూర్, రాజు, మురళీకృష్ణ, ఎన్‌సీబీఈ నాయకులు ప్రవీణ్, రవి, నూర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment