నివాస గృహాల క్రమబద్ధీకరణ
నంద్యాల(అర్బన్): రెవెన్యూ శాఖ ఆక్షేపణ లేని ప్రభుత్వ భూముల్లో 2019 అక్టోబర్ 15 నాటికి ముందే ఏర్పాటు చేసుకున్న నివాస గృహాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు గడువు ఉందన్నారు.
నాణ్యమైన విద్యుత్
అందించాలి
● ఏపీఈఆర్‌సీ చైర్మన్ ఠాగూర్ రామ్‌సింగ్
నంద్యాల(అర్బన్): లో, హై ఓల్టేజీ సమస్యను అధిగమించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ ఠాగూర్ రామ్‌సింగ్ ఆదేశించారు. పట్టణంలోని 2020/132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, 33/11 కేవీ ఇండోర్ సబ్ స్టేషన్లను శుక్రవారం ఆయన స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల 2020/132/ 33 కేవీ సబ్ స్టేషన్ లోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం వంద ఎంవీఏ నుంచి 160 ఎంవీఏకు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. నంద్యాల డివిజన్ పరిధిలో అధిక లోడు ఉన్న 33కేవీ ఫీడర్ నుంచి తక్కువ లోడు ఉన్న ఫీడర్‌కు లోడు డైవర్షన్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. శిరివెళ్ల ప్రాంతంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆయన వెంట ఎస్‌ఈలు మధుసూదనరావు, బాబు రాజేంద్ర, ఈఈ శ్రీనివాసులురెడ్డి, ప్రభాకర్, ఏడీ రమేష్‌కుమార్, ఏఈ రామయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment