కర్నూలు(హాస్పిటల్): సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన 10 మంది వైద్యులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో కర్నూలు మెడికల్ కాలేజీలో పనిచేసే ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్య విధాన పరిషత్‌లోని సీహెచ్‌సీల్లో పనిచేసే నలుగురు వైద్యులు ఉన్నారు. వీరు ఏడాది కాలంగా సెలవు కూడా పెట్టకుండా విధులకు గైర్హాజరవుతుండటంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మాధవిలు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొంత మంది నుంచి స్పందన లేకపోవడంతో త్వరలో ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment