కృత్రిమ గర్భధారణతో మేలుజాతి దూడల ఉత్పత్తి
పగిడ్యాల: ఎదకొచ్చిన పశువులకు కృత్రిమ గర్భాధారణతో మేలు జాతి దూడలను ఉత్పత్తి చేసుకోవచ్చునని పశుసంవర్ధక శాఖ జిల్లా సంచాలకులు డాక్టర్ గోవిందనాయక్ అన్నారు. గురువారం నెహ్రూనగర్ పశుగణాభివృద్ధి ఉపకేంద్రం వద్ద గ్రామ సర్పంచ్ రాజేశ్వరి అధ్యక్షతన రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద లేగదూడల ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన జేడీఏ మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు రైతులు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడంతో లాభసాటిగా ఉంటుందన్నారు. ప్రతి రైతు ఒక ఆవును పెంచుకోవడంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 56 దూడలకు కాల్షి యం టానిక్ తాపించారు. లేగదూడల ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిలో నిలిచిన దూడల పశుపోషకులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీఎల్‌డీఏ ఉప సంచాలకులు డాక్టర్ రాజశేఖర్, జూపాడుబంగ్లా డివిజన్ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రామాంజినాయక్, పశువైద్యులు డాక్టర్ రాగసంధ్య, శృతికీర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment