పాణ్యం: రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడంతో గోరుకల్లు జలాశయ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. జలాశయంలో ఎక్కడ చూసినా కంపచెట్లు, బండ్‌పై లోతైన గోతలు పడ్డాయి. ప్రధానంగా జంగిల్ క్లియరెన్స్, గ్యాలరీలో పనులు, బండ్‌పై గోతులు పూడ్చడం, గట్లకు మరమ్మతులు, గేట్లకు సంబధించి సాంకేతిక పనులు చేయాల్సి ఉంది. జలాశయ కట్ట బండ్‌కు సంబంధించి రివ్యూట్‌మెంట్ జారి పోవడంతో గత ప్రభుత్వం యుద్ధప్రాదిపదికన కోటి రూపాయలతో పనులు చేయించింది. నీటినిల్వకు ఇబ్బంది లేకుండా చేసింది. అయితే కూటమి ప్రభుత్వం రాయలసీమకు తలమానికంగా ఉన్న గోరుకల్లు జలాశయానికి ఆరకొర నిధులు కేటాయించడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఈ విషయంపై గోరుకల్లు జలాశయ ఈఈ సుభకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ. 65లక్షల నిధులు కేటాయించిందన్నారు. ఈ నిధులతో గ్యాలరీలో కొంత మేర జంగిల్ క్లియరెన్స్, గేట్లుకు మరమ్మతులు, ఇతర పనులు చేయాల్సి ఉందని చెప్పారు.
‘గోరుకల్లు’ నిర్వహణ అస్తవ్యస్తం