పాణ్యం: సోలార్ పరిశ్రమ విస్తరిస్తున్న నేపథ్యంలో పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో భారీగా భూ అవకతవకలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. పిన్నాపురం గ్రామ బాధిత రైతులతో కలసి గురువారం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. పిన్నాపురం గ్రామంలోని సర్వే నంబర్ 217లో మూడు ఎకరాల సాగు భూమి ఉందన్నారు. ఈ సర్వే నంబర్‌లోని భూమిని పొలూరు పెద్ద వెంకటస్వామి, పొలూరు తిమ్మనాయుడు, పొలూరు పెద్ద ఆంజనేయులు, పొలూరు చిన్నమ్మ, పొలూరు వెంకటమ్మ, పొలూరు సుబ్బమ్మలు వారసత్వంగా సాగు చేస్తున్నారన్నారు. వీరికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయని తెలిపారు. సోలార్ పరిశ్రమ ఏర్పాటు చేసేవారు.. ఒక్కో రైతుకు రూ. 50వేలు చెక్కును పరిహారం కింద అందించారన్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన శీలం వెంటకరమణ అనే వ్యక్తికి 1.90 సెంట్లు భూమిలో సాగులో ఉన్నట్లు ఎంజాయిమెంట్ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. ఈ సర్టిఫికెట్‌తో శీలం వెంకటరమణ సోలార్ పనులకు అడ్డుపడడమే కాకుండా పొలం నాదంటూ అధికారులకు అధికారి పార్టీ నాయకులతో ఫోన్ చేయించారన్నారు. అధికారులను, బాధిత రైతులను బెదిరిస్తున్నారన్నారు. వందేళ్లుగా అనుభవంలో ఉన్న వ్యక్తులను అధికార పార్టీ అండతో బెదిరించడం దారుణమన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అన్ని రికార్డులు చూసిన బాధిత రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్‌ను కోరారు. కందికాయపల్లె గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసేందుకు సిద్ధపడ్డారని రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త వ్యక్తులకు ఇష్టానుసారంగా సర్టిపికెట్లు జారీ చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసిన రైతులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి వెంట జెట్పీటీసీ మాజీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మండల అధ్యక్షులు కరుణాకర్‌రెడ్డి, సత్యాలు, రామచంద్రుడు, కో–ఆప్షన్ సభ్యులు జాకీర్ ఉసేన్, ఎల్లక్రిష్ణయ్య, గౌడ్, టైలర్‌బాషా, వెంకటరమణ, స్వామి , బాలిరెడ్డి ఉన్నారు.
వందేళ్ల నుంచి సాగులో ఉన్న వారిని
కాదని కొత్తవారికి సర్వే రిపోర్టు
వెంటనే చర్యలు తీసుకోవాలి
రైతులతో కలిసి తహసీల్దార్‌ను
కలిసిన కాటసాని


