● పాతాళగంగలో స్నానానికి వెళ్లి
యువకుడి మృతి
● మృతుడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసి
శ్రీశైలం: స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన యువకుడు హఠాత్తుగా నీటిలో మునిగి మృతి చెందాడు. శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు కథనం మేరకు.. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామానికి చెందిన సీహెచ్ సాయితేజ(18) ఐదుగురు స్నేహితులతో కలిసి శ్రీశైలానికి విహారయాత్రగా వచ్చాడు. పాతాళగంగలో స్నానాలు చేస్తుండగా సాయితేజ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. అక్కడ మత్స్యకారులు సాయితేజ మృతదేహాన్ని నీటిలోంచి బయటికి తీసుకువచ్చి పోలీసులకు సమాచారం అందజేశారు. హైదరాబాద్‌లోని కులీ కుతుబ్‌షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో సాయితేజ పాలిటెక్నిక్ చదువుతున్నారని వారి స్నేహితులు తెలిపారు. విహారయాత్రగా శ్రీశైలానికి వచ్చి స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడంతో వారు తీవ్ర విషాదానికి లోనయ్యారు. సమాచారాన్ని వారి బంధువులకు తెలియజేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


