![క్రీడ](/styles/webp/s3/article_images/2025/02/8/08022025-npt_tab-01_subgroupimage_1880192224_mr-1738954704-0.jpg.webp?itok=B1V82am-)
క్రీడల్లో రాణించాలి
నారాయణపేట: కరీంనగర్ జిల్లాలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన మూడో తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025 లో భాగంగా నారాయణపేట జిల్లా నుంచి ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ సంధ్య రాణి లాంగ్ జంప్‌లో 4.10 మీటర్లు జంప్ చేసి బ్రౌన్ మెడల్ సాధించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్‌ని శుక్రవారం కార్యాలయంలో ఆమెకు మెడల్ ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలలో మహిళలు రాణించాలని, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం
పాన్‌గల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక, కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జబ్బార్ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.50.60 లక్షల కోట్ల బడ్జెట్‌లో అన్ని సంక్షేమ పథకాలకు కోత విధించిందని.. పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల ధరలు, వారు చెల్లించే పన్నులు పెరిగిపోతున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఈ నెల 10న ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన చలో హైదరాబాద్‌ను ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహా ధర్నాకు జిల్లా నుంచి పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బాల్యానాయక్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు భగత్, సీఐటీయూ జిల్లా నాయకులు వెంకటయ్య, నాయకులు జంబులయ్య, డీవైఎఫ్‌ఐ నాయకుడు కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
పరమేశ్వరస్వామి
జాతరకు ఏర్పాట్లు
ఆత్మకూర్: పట్టణ శివారులోని చెరువులో వెలసిన స్వయంభూ పరమేశ్వరస్వామి జాతరకు సంబంధించి మార్చి 1, 2, 3 తేదీల్లో రాత్రి 9గంటలకు తేరుమహోత్సవం కనులపండుగగా జరుగనుంది. శుక్రవారం ఆలయ చైర్మన్ వెంకటనర్సింహారావు, వైస్‌చైర్మన్ ఏపూరి యాదగిరిశెట్టి, ప్రధాన కార్యదర్శి సాయిరాఘవ, కోశాధికారి మణివర్ధన్‌రెడ్డి, సహయ కార్యదర్శి తెలుగు నాగేష్, కమిషనర్ శశిధర్ ఆధ్వర్యంలో ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ చేపట్టబోయే ఏర్పాట్ల గురించి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. 1560వ సంవత్సరంలో ఆలయంలో లింగాన్ని ప్రతిష్ఠించారని, అప్పటి నుంచి మహాశివరాత్రి సందర్భంగా అమావాస్య అనంతరం జాతరను చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
![క్రీడల్లో రాణించాలి
1](/gallery_images/2025/02/8/07nrpt101-210082_mr-1738954704-1.jpg)
క్రీడల్లో రాణించాలి
Comments
Please login to add a commentAdd a comment