
ఇబ్బందిగా ఉంది
మూడు ఎకరాల పొలం ఉంది. ఇంతవరకు రైతు భరోసా పడలేదు. నిత్యం మరికల్ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. రైతు భరోసా డబ్బులు పడకపోవడంతో పెట్టుబడి సాయంకు ఇబ్బందిగా మారింది.
–పద్మనాభం, రైతు, అప్పంపల్లి, మరికల్ మం
ఎకరా భూమికి పడలేదు
మూడు ఎకరాలలోపు రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా పడింది అని అధికారులు చెబుతున్నారు. నాకు ఉన్నది ఎకరా పొలమే. ఇప్పటివరకు రైతు భరోసా తన అకౌంట్‌లో జమ కాలేదు. – చెన్నయ్య, కొత్తపల్లి
మాకెప్పుడొస్తుందో..
మాకు 3.10 ఎకరాల పొలం ఉంది. గత వారం రోజుల క్రితం 3 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా పడిందని చెప్పారు. మాకు ఎప్పుడు రైతు భరోసా పడుతుందో తెలియని పరిస్థితి. త్వరగా అందజేస్తే పంటల పెట్టుబడికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పుతాయి. – బాల్యనాయక్, కొత్తపల్లి తండా
ఆందోళన అవసరం లేదు..
రైతు భరోసా డబ్బులు రైతులకు రోజు పడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు లక్ష మందికి పైగా రైతులకు వారి ఖాతాలో నగదు జమ అయ్యాయి. అర్హులైన రైతులందరికి మార్చి 31 వరకు అందరికి రైతు భరోసా వస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– జాన్‌సుధాకర్, డీఏఓ
●

ఇబ్బందిగా ఉంది

ఇబ్బందిగా ఉంది

ఇబ్బందిగా ఉంది
Comments
Please login to add a commentAdd a comment