వివరాలు 8లో u
నారాయణపేట: రైతు భరోసా పంపిణీలో వాయిదా ల పర్వం కొనసాగుతోంది. దీంతో జిల్లాలోని చాలా మంది రైతులు తమకు ఇంకెప్పడు సాయం అందుతుందని ఎదురుచూస్తున్నారు. సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి జిల్లాలోని కోస్గి మండలం చంద్రవాంఛలో నాలుగు పథకాల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని జనవరి 26న శ్రీకారం చుట్టారు. జిల్లా లోని 1,92,020 మంది రైతులకుగాను ( 4,58,626 ఎకరాలకు) రూ.266 కోట్లు రైతు భరోసా వారి ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. తొలి రోజు నారాయణపేట జిల్లాలో 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,348 రైతులకు రూ.13.87 కోట్లు జమచేసింది. కాగా రెండు, మూడో విడతలో రైతుల ఖాతాలో జమ చేసింది కేవలం రూ.97 కోట్లు మాత్రమే అని చెప్పవచ్చు. మిగతా రైతులు తమకు ఎప్పుడు రైతు భరోసా పడుతుందోనని ఎదురుచూస్తున్నారు. ఈ నెల 21న సీఎం వస్తుండడంతో ఆ లోపు దాదాపు బడ్జెట్ రిలీజ్ చేయిస్తారేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కొందరికే అందిన ‘రైతుభరోసా’
మొత్తంగా రూ.266 కోట్లకు.. రూ.97 కోట్లు ఖాతాల్లో జమ
పట్టా పాసు బుక్కులున్న రైతులు 1,92,020 మంది
మూడు విడతల్లో 3 ఎకరాల్లోపు వారికి మాత్రమే అందిన వైనం
పూర్తయ్యేదెప్పుడని రైతులు ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment