
ముగిసిన టెన్త్ ఇంటర్నల్ మార్కుల పరిశీలన
నారాయణపేట రూరల్: సీసీఈ విదానంలో భాగంగా టెన్త్ విద్యార్థులకు పాఠశాలలో నిర్వహించే కృత్యాలకు సంబంధించి సబ్జెక్ట్ టీచర్లు వేసిన ఇంటర్నల్ మార్కుల పరిశీలన కార్యక్రమం బుధవారం ముగిసింది. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 146 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 7,631 మంది టెన్త్ విద్యార్థులకు ఆ పాఠశాలలో నిర్వహించిన ఫార్మెటివ్ పరీక్షలు, ప్రాజెక్టు ఇతర అంశాలకు సంబందించి సబ్జెక్టు వారికిగా 20 మార్కుల చొప్పున ఒక్కో విద్యార్థికి మొత్తం కేటాయించిన 120మార్కులను సరిచూశారు. జిల్లా వ్యాప్తంగా జీహెచ్‌ఎంల నేతృత్వంలో ఒక లాంగ్వేజ్, మరో నాన్ లాంగ్వేజ్ టీచర్ల 31 ప్రత్యేక బృందాలు గత మూడు రోజులుగా వారికి కేటాయించిన షెడ్యూల్ ప్రకారం ఆరు చొప్పున స్కూళ్లను తనిఖీ చేశారు. మార్కుల పరిశీలన చేసి ఆయా మార్కులను ఆన్‌లైన్ అప్‌లోడ్ చేయించి డీఈఓ కార్యాలయంలో నివేదిక అందించారు. అదేవిధంగా గురువారం నుంచి జరిగే మొదటి ఫ్రీఫైనల్ పరీక్షల కోసం విద్యార్థులకు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ పాఠశాలలను ఎంఈఓ బాలాజి, డీఎస్‌ఓ భానుప్రకాష్, జీహెచ్‌ఎంలు అనురాధ, సత్యనారాయణసింగ్, సునీత, భారతి, బృంద సభ్యులు యాద్గీర్ నారాయణరెడ్డి, మధుసూదన్, రవికుమార్ తనిఖీలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment