
సీఆర్పీలతోనే మహిళా సంఘాల బలోపేతం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామల్లో స్వయం సహాయక (మహిళా) సంఘాల బలోపేతం సీఆర్పీలతోనే సాధ్యమని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో ‘సంఘాల బలోపేతంకు సీఆర్పీ వ్యూహం’ కార్యక్రమాన్ని కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్య దేవరాజన్ మాట్లాడుతూ సీఆర్పీలు త్రిపుర, గోవా, ఇతర రాష్ట్రాల్లో మహిళలకు సంఘాల ఏర్పాటుపై శిక్షణ నిచ్చారన్నారు. సీఆర్పీలు ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో మహిళా సంఘాల ఏర్పాటు, ప్రోత్సాహం, బలోపేతం కోసం 8 రోజుల ఆయా జిల్లాలోని గ్రామాలకు వెళ్లి అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. గ్రామాల్లో మహిళలకు చాలా అంశాలపై అవగాహన లేక సంఘాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ ‘సంఘాల బలోపేతం–సీఆర్పీ వ్యూహం’ కార్యక్రమం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామైక్య, మండల, జిల్లా, రాష్ట్ర సమాఖ్యలు బాగా పనిచేసి ఆదర్శ రాష్ట్రంగా నిలవాలన్నారు. పలువురు సీఆర్పీలు, బుక్ కీపర్లు సంఘాల ఏర్పాటు, బుక్‌కీపింగ్‌తో పలు అంశాలనపై అవగాహ న కల్పించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సెర్ప్ ఐబీ డైరెక్టర్ నవీన్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, మహబూబ్‌నగర్, గద్వా ల, వికారాబాద్, నారాయణపేట డీఆర్‌డీఓలు నర్సింహులు, నర్సింగరావు, శ్రీనివాస్, మొగు లప్ప, అదనపు పీడీలు, ఏపీఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment