పౌష్టికాహారం సక్రమంగా అందించాలి
ఆత్మకూర్: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సూచించారు. శుక్రవారం పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పించడంతో పాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఆయన వెంట నాయకులు రహ్మతుల్లా, పరమేశ్, తులసీరాజ్, శ్రీను, గంగాధర్‌గౌడ్, నాగేశ్, సుదర్శన్‌శెట్టి, యాదగిరిశెట్టి, సాయిరాఘవ, గాలిపంపు శ్రీను, మణివర్ధన్‌రెడ్డి, రవీందర్, అబ్దుల్లా, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment