వంతెన నిర్మాణంతో తీరనున్న కష్టాలు | - | Sakshi
Sakshi News home page

వంతెన నిర్మాణంతో తీరనున్న కష్టాలు

Published Sat, Feb 8 2025 12:31 AM | Last Updated on Sat, Feb 8 2025 12:31 AM

-

కొత్తపల్లి: మండలంలోని మన్నాపూర్‌ అల్లీపూర్‌ మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు శుక్రవాకం కొగండల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి, కడా ప్రేత్యకాధికారి వెంకట్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంతెన లేకపోవడంతో అల్లీపూర్‌ గామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా రూ.8కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారన్నారు. ఈ వంతెన నిర్మాణంతో ఇరు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. డీఈ విలోక్‌,ఏ ఈ అంజిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముద్ది బీములు, రమేష్‌రెడ్డి, నర్సిములు, లక్ష్మి నారాయణ రెడ్డి, మహేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, చెన్నప్ప పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement