
‘కర్ని’ మండల సాధనే లక్ష్యం
మక్తల్: కర్ని గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటింపజేయడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని 11 గ్రామాల ప్రజలు తీర్మానించారు. ఈమేరకు శనివారం మండలంలోని పస్పుల, పంచదేవ్‌పాడు, పారేవుల, ముస్లాయిపల్లి, దాదాన్‌పల్లి, అనుగొండ, అంకెన్‌పల్లి, భగువాన్‌పల్లి, ఎర్సాన్‌పల్లి గ్రామాల ప్రజల మద్దతు కోరుతూ సమావేశాలు నిర్వహించారు. కృష్ణానది తీరాన ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కర్నిని మండలంగా ప్రకటించాలని వారు నినదించారు. ఈ ప్రాంతాలకు మక్తల్ దాదాపు 25 కిలోమీటర్ల దూరంగా ఉంటుందని, నిత్యం రాకపోకలు సాగించాలంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నదని, ఏ చిన్న పని అయిన మక్తల్‌కు రావాల్సిందేనని అన్నారు. కర్నిని మండల కేంద్రంగా ప్రకటిస్తే ఈ ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. విషయాన్ని విడతల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు.
అలసందలు క్వింటాల్ రూ.6,555
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం అలసందలు క్వింటాల్‌కు గరిష్టం, కనిష్టంగా రూ.6,555 ధర పలికింది. అలాగే, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,650, కనిష్టంగా రూ.6,296, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,809, కనిష్టంగా రూ.6,916, వేరుశనగ గరిష్టంగా రూ.6,049, కనిష్టంగా రూ.3,601 ధర పలికాయి.
ప్రశాంతంగా
నవోదయ ప్రవేశ పరీక్ష
కందనూలు: జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 20 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 5,016 మంది విద్యార్థులకు గాను 4,161 మంది హాజరయ్యారు. జిల్లాలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగాయని జిల్లా ఇన్‌చార్జ్ భాస్కర్‌కుమార్ తెలిపారు. 9, 11 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించిన ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment