
సీఎంను కలిసిన ఎమ్మెల్యే
మక్తల్: సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రజాభవనంలో హైదరాబాద్‌లో బీసీ కులగణనపై ప్రత్యేకంగా బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. దేశంలో కులగణన చేపట్టి అధికారికంగా ఆమోదముద్ర వేసిన తొలి రాష్ట్రం మనదేనని, బీసీల సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతామని సీఎం ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కులగణన చేయడం సీఎం రేవంత్‌రెడ్డికే సాధ్యమైందని అన్నారు. అనంతరం సీఎంను సన్మానించారు.
గురుకుల ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం
● జిల్లాలో మెత్తం 8 పరీక్ష కేంద్రాలు
● హాజరుకానున్న 4130 విద్యార్థులు
నారాయణపేట ఎడ్యుకేషన్: గురుకుల విద్యాలయాల్లో 5, 6, 9వ తరగతుల ప్రవేశాల నిమిత్తం ఆదివారం నిర్వహించే ప్రవేశ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కో ఆర్డినేటర్ యాదమ్మ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 4130 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందని, కేంద్రాలకు 30 నిమిషాల ముందే చేరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు తమ వెంట హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నును వెంట తీసుకురావాలన్నారు. ఈ పరీక్షకు గాను 8 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు , ఒక రూట్ ఆఫీసర్‌ను, ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించినట్లు తెలిపారు.
శనగలు క్వింటాల్ రూ.5,677
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం శనగలు క్వింటాల్ గరిష్టం, కనిష్టంగా రూ.5,677 ధర పలికాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,420, కనిష్టంగా రూ.4,110 ధర పలకగా 112 క్వింటాళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. నల్ల కందులు గరిష్టంగా రూ.7,659, కనిష్టంగా రూ.6,850, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,759, కనిష్టంగా రూ.6,706 ధర పలకగా.. 180 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. చింతపండు గరిష్టంగా రూ.7,069, కనిష్టంగా రూ.5,319 ధర పలికింది.
జడ్చర్లలో వేరుశనగ రూ.7,044
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.7,044, కనిష్టంగా రూ.5,369 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు క్వింటాల్ సరాసరిగా రూ.5,822, పత్తి గరిష్టంగా రూ.6,262, కనిష్టంగా రూ.5,501, కందులు గరిష్టంగా రూ.7,149, కనిష్టంగా రూ.5,097, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,870, కనిష్టంగా రూ.5,001, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,397, కనిష్టంగా రూ.2,167, ఉలువలు రూ.6,100 ధర వచ్చాయి.

సీఎంను కలిసిన ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment