
‘పేట – కొడంగల్’ పథకం భూసర్వే అడ్డగింత
మక్తల్: పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసర్వే పనులను మండలంలోని కాట్రెవ్‌పల్లి రైతులు శనివారం అడ్డుకున్నారు. మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని అక్కడికి తీసుకెళ్లేందుకు సర్వే, రెవెన్యూ అధికారులు భూసర్వే చేస్తుండడంతో తమ భూములు పోతాయన్న భయంతో రైతులు అడ్డుకున్నారు. ప్రస్తుతం కాట్రెవ్‌పల్లి గ్రామం వద్ద సర్వే పనులు కొనసాగుతున్నాయి. తమకు ఈ భూములే జీవనాధారమని, ఇవి పోతే తాము ఎలా బతకాలని రైతులు అధికారు లను ప్రశ్నించారు. భూసర్వే నిర్వహించే ప్రసక్తే లేదంటూ భీష్మించారు. ఇలాగే 18వ తేదీన భూసర్వేను రైతులు అడ్డుకోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. తాజాగా మరోసారి పనుల ను అడ్డుకోవడంతో అధికారులు ఏం చేయాలో పాలుపోలేదు. ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డితోపాటు స్పెషల్‌పార్టీ పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పినా ఫలితం లెకుండా పోయింది. సోమ వారం సర్వే పనులు నిర్వహిస్తామని, సహకరించాలని అధికారులు పేర్కొంటూ వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment