
లెక్క తేలింది..
జిల్లాలో సాగుకు యోగంగా లేని భూములు 3,892 ఎకరాలు
3,892 ఎకరాలకు
రైతుభరోసా కట్
జిల్లాలో 1,92,020 మంది రైతులు ఉండగా.. 4,58,626 ఎకరాలకు రూ.266 కోట్లు రైతు భరోసా అందాల్సి ఉంది. అయితే కొంతమంది రైతుల భూముల్లో ప్రభుత్వ అనుమతులు లేని వెంచర్లు వేసినప్పటికీ ధరణిలో మాత్రం వ్యవసాయ భూమిగానే ఉండి పోయింది. ప్రాజెక్టులో ముంపునకు గురై అవార్డు అయిన భూములు సైతం రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములు, రోడ్లు, ఇతర అవసరాల కోసం సేకరించిన భూములు వ్యవసాయ భూములుగానే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అలాంటి భూములకు సైతం రైతుబంధు అందించింది. అయితే రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు రైతుభరోసా తరహా రైతుల నుంచి రైతుభరోసాకు దరఖాస్తులు సైతం స్వీకరిస్తోంది. క్లస్టర్ల వారీగా వ్యవసాయశాఖ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో జిల్లాలో రైతుభరోసా అర్హుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది.
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు.. పంటల సాగులో రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ‘రైతుభరోసా’ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే గత ప్రభుత్వం ధరణిలో ఉన్న భూములన్నింటికీ రైతుబంధు అమలు చేయగా సాగుకు యోగ్యంగా లేని భూముల యాజమానులు సైతం రైతుబంధును పొందారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం సాగుకు యోగ్యంగా ఉన్న భూములకు మాత్రమే రైతుభరోసా అందిస్తామని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించి సాగుకు యోగ్యంగా లేని భూముల లెక్క తేల్చడంతో జిల్లా వ్యాప్తంగా 3,892 ఎకరాలను గుర్తించారు. దీంతో ప్రభుత్వానికి రూ. 4.67 కోట్లు నిధులు మిగిలినట్లయింది. గత ఆరేళ్లుగా బీఆర్‌ఎస్ హయంలో సాగుకు యోగ్యం కాని భూములకు చెల్లించిన రైతు బంధుతో అప్పటి ప్రభుత్వానికి రూ.56 కోట్లు నష్టం వాటిల్లినట్లయింది. జిల్లాలో 1,92,020 మంది రైతులు ఉన్నట్లు గుర్తించారు. గత ప్రభుత్వం ఎకరానికి సీజన్‌కు రూ.5వేలు మాత్రమే చెల్లించగా ప్రస్తుత ప్రభుత్వం ఎకరానికి రూ.6వేలు చెల్లిస్తుంది. దీంతో ఈ సారి రైతుభరోసా కింద ఈ సీజనకు జిల్లా రైతులకు రూ.266 కోట్లు పెట్టు బడి సాయంగా అందనుంది.
రాళ్లు, గుట్టలు, రియల్ ఎస్టేభూములకు రైతు భరోసా కట్
ప్రభుత్వానికి రూ.4.67 కోట్లు మిగులు
Comments
Please login to add a commentAdd a comment