
టాలెంట్ టెస్టులు ప్రతిభకు దోహదం
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు టాలెంట్ టెస్టులు ఎంతో దోహదపడతాయని డీఈవో గోవిందరాజు అన్నారు. ఈనెల 2న జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పూసల్ పహాడ్ టాలెంట్ టెస్ట్ ఫలితాలను శనివారం సాయంత్రం డీఈవో చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలపై భయాన్ని విడాలని, ఇష్టంతో చదవాలని, ఉన్నత లక్ష్యాలను చేరెందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాలన్నారు. టాలెంట్ టెస్టులు రాయడం వల్ల విద్యార్థుల్లోనూ ప్రతిభ బయటకు వస్తుందని, ఇలాంటి పోటీ పరీక్షల నిర్వహణ చేపట్టడం అభినందనీయమన్నారు. టాలెంట్ టెస్ట్ విజేతలకు మార్చి 2న బహుమతులు అందిస్తున్నట్లు నిర్వాహకులు షేర్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 120 పాఠశాలల నుంచి 3750 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలు వేరువేరుగా మొదటి మూడు స్థానాలకు క్యాష్ అవార్డు, మిగితా టాప్ టెన్ విద్యార్థులకు బహుమతులు, ప్రతి స్కూల్ టాపర్‌కు ప్రశంసా పత్రం, ప్రోత్సాహక బహుమతి అందిస్తామన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, నాగార్జున రెడ్డి, నర్మదా, శ్రీనివాస్, సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, డీఎస్‌ఓ భాను ప్రకాష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment