నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు ఉన్నా చెత్తపై చిత్తశుద్ధి అంతంతగానే కనిపిస్తోంది. కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది. ప్రతి పల్లె, పట్టణాల్లో డంపింగ్ యార్డులు నిర్మించి వాహనాల ద్వారా చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నప్పటికీ మున్సిపాలిటీల్లో మాత్రం నేటికి డంపింగ్ యార్డులు లేకపోవడంతో పట్టణ శివార్లలో పాడుబడ్డ బావులు, ప్రధాన రోడ్ల వెంట చెత్తను వేస్తున్నారు. దీంతో చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో చెత్త సేకరణ చేపడుతున్నప్పటికీ ఆటోలో తడి,పొడి చెత్తను వేర్వేరు వేయాలని రాసి పెట్టారు. కానీ జనం తడి,పొడి చెత్తను ఒకే దానిలో వేస్తుండడం, నేరుగా ఆటోలో తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరు చేసేందుకు అక్కడి సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు.
వీలిన గ్రామాలు చెత్తమయం
మక్తల్ మున్సిపాలిటీలో తిర్మలాపూర్, చందాపూర్ విలీనమయ్యాయి. మక్తల్ పట్టణంలో సేకరించిన చెత్తను నగర శివారులోని కానాపూర్‌కు వెళ్లే రహదారిలో డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. తిర్మలాపూర్, చందపూర్‌లో సేకరించిన చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు. వీలిన గ్రామాలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ ఆయా గ్రామాల జనం వాపోతున్నారు.
మద్దూర్, కోస్గిలో కానరానిసేంద్రియ ఎరువుల తయారీ
పేట, మక్తల్‌లో తడి, పొడి చెత్త వేర్వేరు చేసేందుకు నానా అవస్థలు
దుర్గందభరింతగా డంపింగ్ యార్డులు
పట్టించుకోని అధికారులు, సిబ్బంది
కొరవడిన చెత్త‘శుద్ధి’
కొరవడిన చెత్త‘శుద్ధి’
కొరవడిన చెత్త‘శుద్ధి’
కొరవడిన చెత్త‘శుద్ధి’