పాలమూరు ప్రజల ఆరాధ్యదైవం అమ్మాపురంలో ఉన్న కురుమూర్తిస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఘాట్‌రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం 20–25 ఎకరాల స్థలాన్ని కేటాయించి, నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు.