మెరుగైన వైద్యసేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యసేవలు అందించాలి

Mar 21 2025 12:54 AM | Updated on Mar 21 2025 12:50 AM

దామరగిద్ద: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వార్డులను పరిశీలించి నిల్వ ఉన్న మందులు, స్టాక్‌ రిజిస్టర్‌, సిబ్బంది హాజరు రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కుటుంబ తగాదాలతో చెవికి గాయమై చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన వివాహిత మహిళతో కలెక్టర్‌ మాట్లాడి బాధిత మహిళకు న్యాయ సహాయం చేయాలని అక్కడే ఉన్న సఖి కేంద్రం నిర్వాహకురాలికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి, తహాసీల్దార్‌ జలీల్‌, ఎంపీడీఓ సాయిలక్ష్మి, వైద్యురాలు సిబ్బంది పాల్గొన్నారు

పనితీరు మెరుగుపర్చుకోకపోతే చర్యలు

నిర్దేశించిన లక్ష్యాన్ని గుడువు లోగా పూర్తి చేయడంతో గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్‌ పూర్తిగా విఫలమయ్యాయని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్ఫ్‌ బ్యాంక్‌ లింకేజీలో వంద శాతం టార్గెట్‌ను నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని, మండలంలో 94 శాతం పెండింగ్‌ ఉండటంతో ఏఈపీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాది హామీ పథకంలో కూలీలకు అవగాహన కల్పించి ఉపాధి పొందేలా చూడాలని, కొన్ని గ్రామాల్లో కేవలం పది మంది మాత్రమే ఉపాధి పనులకు వస్తున్నారని అన్నారు. ఎంపీడీఓగా మండలంలో ఏం చేస్తున్నారని ఎంపీడీఓ సాయిలక్ష్మిని నిలదీశారు. పనితీరును మెరుగు పరుచుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశాని హాజరు కాని టెక్నికల్‌ అసిస్టెంట్‌లకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఆర్డీఓ అంజయ్య, డీపీఎం జయన్న, ఏపీఎం నర్సిములు తహసీల్దార్‌ జలీల్‌లు పాల్గొన్నారు.

అంతర్జాతీయ సైన్స్‌ వేదికకు శివారెడ్డి ఎంపిక

నారాయణపేట: జపాన్‌ ప్రభుత్వం నిర్వహించే సకురా సైన్స్‌ ఉన్నత పాఠశాల ప్రోగ్రాంకు దేశం నుంచి 54 మంది విద్యార్థుల ఆవిష్కరణలు ఎంపిక కాగా.. అందులో జిల్లాలోని దామరగిద్ద సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి శివారెడ్డి ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అభినందించారు. గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో విద్యార్థి ఏ.శివారెడ్డి, గైడ్‌ టీచర్‌ జరీనా, ప్రిన్సిపల్‌ కె.శ్రీనివాసులును కలెక్టర్‌, ట్రైనీ కలెక్టర్‌ గరిమా నరులా సన్మానించారు.

విద్యార్థుల వినూత్నఆలోచనలను ప్రోత్సహించాలి

విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టేలా వినూత్న ప్రయోగాలు, వారి అభిరుచికి తగినట్లు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్‌ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న అటల్‌ కింకరింగ్‌ ల్యాబ్‌ను ఆమె పరిశీలించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement