కోస్గి: జిల్లాలో సారా విక్రయాలు, మత్తుకు బానిసలవుతున్న యువతపై శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘మళ్లీ గుడుంబా..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో అటు సారా తయారీదారులు, ఇటు ఎకై ్సజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. పుర పరిధిలోని నాగుసాన్‌పల్లి గుట్టల ప్రాంతంలో ఉన్న సారా తయారీ కేంద్రాన్ని మూసివేసి సామగ్రిని అక్కడ నుంచి తరలించారు. ఎకై ్సజ్ కానిస్టేబుల్ ఒకరు తయారీదారులకు సమాచారం ఇవ్వడంతో కేంద్రాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సారంగరావుపల్లితండా, అమ్లికుంట్లతండా, కొత్తపల్లి మండలంలోని లక్ష్మీనాయక్‌తండా, తుపాకితండాతో పాటు పలుచోట్ల సారా బట్టీలు మూసివేశారు. ఓ అధికారి ఆదేశాల మేరకు పట్టణంలోని ఓ ప్రముఖ హోల్‌సెల్ వ్యాపారి పెద్ద మొత్తంలో నిల్వ చేసిన బెల్లాన్ని శనివారం రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. ఇప్పటికై నా ఎకై ్సజ్ అధికారులు స్పందించి సారా తయారీకి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
మూతబడ్డ సారా తయారీ కేంద్రాలు