గడువు పొడిగించాలి
ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకం మళ్లీ ప్రారంభించడం సంతోషంగా ఉంది. కానీ, కేవలం ఉత్తర్వులు ఇచ్చి రెండు రోజుల్లోనే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడంతో ఆసక్తి, అర్హత ఉన్నా రైతులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం దరఖాస్తు గడువు పెంచి అర్హత ఉన్న రైతులకు అవకాశం కల్పించాలి.
– వెంకట్రాములు, రైతు సంఘం అధ్యక్షుడు
రైతులకు ఎంతో ప్రయోజనం
ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంతో సన్న, చిన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. జిల్లాకు కేటాయించిన యూనిట్లకు సంబంధించి మండలాల వారీగా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాం. మండలాల వారీగా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన రైతులకు యాంత్రీకరణ సామగ్రి అందజేస్తాం. దరఖాస్తు తేదీ పొడగింపు ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్ణీత గడువు వరకు వచ్చిన దరఖాస్తులు తీసుకున్నాం.
– జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి
●
గడువు పొడిగించాలి


