
వసతుల కల్పనపై దృష్టి..
యూనివర్సిటీలో కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రస్తుతం అవసరమైన నిధులు అందుబాటులో ఉండడంతో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఇంజినీరింగ్, లా కళాశాలల భవనాల నిర్మాణం కోసం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నారు. ఈ రెండు కళాశాలల్లో చదివే విద్యార్థుల కోసం రెండు బాలుర, బాలికల హాస్టళ్లు, ఒక అకామిక్ బ్లాక్‌ను నిర్మించనున్నారు. అన్ని డిపార్ట్‌మెంట్లలో రీసెర్చ్ కోసం రూ.11 కోట్లతో రీసెర్చ్‌ఫెసిలిటీ భవనం, విద్యార్థులను అథ్లెటిక్స్ ప్రోత్సహించేందుకు సింథెటిక్ ట్రాక్, సందర్శకుల కోసం గ్యాలరీ నిర్మిస్తున్నారు. త్వరలో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.