జాతీయ ఖోఖో పోటీలకు ‘కర్ని’ విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

జాతీయ ఖోఖో పోటీలకు ‘కర్ని’ విద్యార్థిని

Apr 2 2025 12:26 AM | Updated on Apr 2 2025 12:26 AM

జాతీయ ఖోఖో పోటీలకు ‘కర్ని’ విద్యార్థిని

జాతీయ ఖోఖో పోటీలకు ‘కర్ని’ విద్యార్థిని

మక్తల్‌: మండలంలోని కర్ని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని శశిరేఖ జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ బి.రూప మంగళవారం తెలిపారు. ఈ నెల 2నుంచి 5వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో శశిరేఖ పోల్గొంటుందని పేర్కొన్నారు. మూడుసార్లు రాష్ట్రస్థాయి టోర్నీల్లో విద్యార్థిని విజయం సాధించినట్లు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి జట్టు విజయానికి కృషిచేయాలని ఆకాంక్షించారు.

● జాతీయస్థాయి ఖోఖో చాంపియన్‌షిప్‌ టెక్నికల్‌ అఫిషియల్‌గా కర్ని పాఠశాల పీఈటీ బి.రూప ఎంపికై నట్లు జీహెచ్‌ఎం వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న శశిరేఖ, పీఈటీ రూపను గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement