సన్న బియ్యం పంపిణీ షురూ..
నారాయణపేట: జిల్లాలో రేషన్‌కార్డు లబ్ధిదారులు అందరికీ సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న పేదలకు సన్న బియ్యం ఇస్తామని ఇటీవల చెప్పగా.. నేటి నుంచి (మంగళవారం) నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చు ట్టింది. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్ధేశంతో సివి ల్ సప్లయ్ అధికారులు సైదులు, బాలరాజు ప్రణాళిక బద్దంగా జిల్లాలోని రేషన్ దుకణాలకు సన్న బియ్యం చేరేవిధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముందస్తుగా డీలర్లకు సమావేశం చేరవేసి గత మూడు రోజులుగా వస్తున్న సన్న బియ్యం కోటాను ప్రతి రేషన్ దుకాణానికి చేరేలా చొరవ తీసుకున్నా రు. ప్రతినెలా ఒకటో తేదీకి ముందే దుకాణాలకు బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని ఎంఎల్‌ఎస్ పాయింట్లలో తగినన్ని బియ్యం నిల్వ లు లేకపోవడంతో.. ప్రతినెలా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా ఆలస్యమవుతోంది. ఈనేపథ్యంలో ఈసారి జిల్లాలోని జిల్లాలోని మొత్తం 301 రేషన్ దుకాణాల్లో 1,44,472 రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యం కోటా 3,382 ఎంటీఎస్‌ను ఏప్రిల్ నెలకు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేలతో ప్రారంభం
జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టడంతో మంగళవారం నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికాకరెడ్డి ధన్వాడ, మరికల్, నారాయణపేట, దామరగిద్దలో సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. అదే విధంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్‌లో ప్రారంభించారు. జిల్లాలోని అన్ని రేషన్ నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు.
పక్కదారి పట్టకుండా చర్యలు
రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే దొడ్డు బియ్యాన్ని చాలాచోట్ల రేషన్ డీలర్లే లబ్ధిదారులకు బియ్యం బదులు నగదు చెల్లించి.. అదే బియ్యాన్ని మిల్లర్లకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. ఈమేరకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి
జిల్లాలో మొత్తం 1.44 లక్షల రేషన్‌కార్డులు
ఏప్రిల్ బియ్యం కోటా 3,382 ఎంటీఎస్


