సాక్షి, ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,652 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,08,211 దాటింది. ఈ మహమ్మారి నుంచి కొత్తగా 42,533 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 90,58,822 దాటింది. దేశంలో ప్రస్తుతం 4,09,689 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 94.28 శాతంగా ఉంది. కాగా 24 గంటల్లో కరోనాతో కొత్తగా 512 మంది మరణించగా.. మొత్తం మరణించినవారి సంఖ్య 1,39,700గా ఉంది. దేశంలో ప్రస్తుతం కోవిడ్–19 మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో 4.26 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment