
న్యూఢిల్లీ: దేశ్యాప్తంగా కరోనాబారినపడి మరో 1033 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,14,031 కు చేరింది. కొత్తగా 61,871 మందికి వైరస్ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,552 కు చేరింది. దేశంలో ప్రస్తుతం 7,83,311 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో తాజాగా 72,614 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 65,97,210 మంది కోవిడ్‌ను జయించారు. ఈమేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 88.03 శాతంగా ఉందని, మరణాల రేటు 1.52 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 10.45 శాతం ఉందని వెల్లడించింది.
(చదవండి: ఐజీని కబళించిన కరోనా మహమ్మారి)
Comments
Please login to add a commentAdd a comment