తిరువనంతపురం: కేఎస్‌ఆర్టీసీ అనే పేరు రెండు రాష్ట్రాల ఆర్టీసీకి ఉంది. ఈ పేరుపై ఈ వివాదం కొనసాగుతోంది. తాజాగా దీనిపై రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్‌మార్క్స్‌కు తుది నిర్ణయం వెలువరించింది. ఆ పేరు ఇక కేరళకే దక్కుతుందని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో కర్ణాటకకు షాక్ తగిలింది. కేరళ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, కర్ణాటక స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అని పేర్లు ఉన్నాయి. వీటి సంక్షిప్త పేరు (షార్ట్ నేమ్) కేఎస్‌ఆర్టీసీ అని వస్తుంది. అయితే ఈ పేరు రెండు రాష్ట్రాలు వినియోగిస్తున్నాయి. కేఎస్‌ఆర్టీసీ అనే పేరుతో ఏనుగు వాహనం అనే నిక్‌నేమ్‌తో కూడిన పేరును కేరళ వాడాలని ట్రేడ్‌మార్క్ ఆఫ్ రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది.
కేఎస్‌ఆర్టీసీ పేరు తమదని, కేరళ వాడొద్దంటూ 2014లో కర్ణాటక కేరళకు నోటీసులు ఇచ్చింది. కేఎస్‌ఆర్టీసీని తమకు కేటాయించాలంటూ అప్పటి కేరళ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఆంటోనీ చాకో రిజిస్ట్రర్ ఆఫ్ ట్రేడ్‌మార్క్స్‌కు దరఖాస్తు చేశారు. ఏడేళ్లుగా విచారణ కొనసాగుతోంది. 1999 ట్రేడ్‌మార్క్స్ చట్టం ప్రకారం కేఎస్‌ఆర్టీసీ పేరును కేరళకు కేటాయిస్తూ శుక్రవారం ట్రేడ్‌మార్క్స్ రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేరళ రోడ్డు రవాణా శాఖ మంత్రి ఆంటోనీ రాజు హర్షం వ్యక్తం చేశారు. కేఎస్‌ఆర్టీసీ పేరు మాత్రమే కాదని, తమ సంస్కృతికి అద్దం పట్టేది అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment