Amitabh Bachchan Shared Image After Mumbai Police Action Against - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: అమితాబ్‌ బచ్చన్‌ పోస్ట్‌ వివాదం..రంగంలోకి దిగిన ముంబై పోలీసులు

Published Mon, May 15 2023 9:06 PM | Last Updated on Mon, May 15 2023 9:21 PM

Amitabh Bachchan Shared Image After Mumbai Police Action Against - Sakshi

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు, బిగ్‌ బీ అమితా బచ్చన్‌ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో విషయాలను పంచుకుంటారు. ఆయన కూడా ఎప్పుడూ మంచి ఇన్‌స్పిరేషన్‌గా ఉండే వీడియోలను నెటిజన్లతో షేర్‌ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా తనకు సంబంధించిన ఓ విషయాన్ని నెటిజన్లతో పంచుకుంటూ ఓ ఫోటోని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

దీంతో ఆ పోస్ట్‌ కాస్త ముంబై పోలీసుల కంట పడటంతో సోషల్‌ మీడియా వేదికగా ఆయనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఇంతకీ అందులో ఏముందంటే..ఆయన ఓ వర్క్‌ ప్లేస్‌కి వెళ్లేందుకు ఓ బైక్‌ రైడర్‌ని ఆశ్రయించారు. ఆ రైడర్‌ వెనకాల కూర్చొని వెళ్లారు. ఈ మేరకు అమితాబ్‌ ట్విట్టరఫ్‌ వేదికగా..సదరు రైడ్‌ బడ్డీకి ధన్యవాదాలు తెలిపారు. మీరు సమయానికి పని ప్రదేశానికి చేర్చారు. పైగా పరిష్కరించలేని ట్రాఫిక్‌ జామ్‌ని నివారించడంలో సాయం చేసినందుకు ధన్యావాదాలు అంటూ ట్విట్‌ర్‌లో ఆ ఫోటోని కూడా షేర్‌ చేశారు.

అక్కడి వరకు అంతా భాగానే ఉంది. ఐతే ఆ ఫోటోలో రైడ్‌ చేస్తున్న వ్యక్తి, అమితా బచ్చన్‌ ఇద్దరూ కూడా హెల్మట్‌ ధరించలేదు. దీంతో ముంబై పోలీసు ఆ ట్వీట్‌ని రీ ట్వీట్‌ చేస్తూ బైక్‌పై ఉన్న ఇరువురు రైడర్లు హెల్మట్‌ ధరించలేదని పేర్కొంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇరువురిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ ఘటన చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదన్న విషయాన్ని తేలతెల్లం చేసింది. ప్రజల భద్రత కోసం రూల్స్‌ ఉంటాయి. వాటిని అందరూ పాటించాల్సిందే తప్పదు.

(చదవండి: కాంగ్రెస్‌కు మద్దతిస్తా కానీ..: మమతా బెనర్జీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement