
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: దేశంలోని 66 శాతం పాఠశాలలు, 60 శాతం అంగన్‌వాడీలు, 69 శాతం గ్రామ పంచాయతీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలో రక్షిత మంచినీరు అందుబాటులో ఉందని జల శక్తి మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లోని స్కూళ్లు, ఆశ్రమశాలలు, అంగన్‌వాడీ సెంటర్లలో పూర్తి స్థాయిలో ట్యాప్ వాటర్ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ సెంటర్లలో మంచినీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 2న 100 రోజుల క్యాంపెయిన్ నిర్వహించినట్లు తెలిపారు.
2024 నాటికి ప్రతి ఇంటికి కొళాయి నీటిని అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన జలజీవన్ మిషన్‌లోనే స్కూళ్లు, అంగన్‌వాడీల కొళాయిలు కూడా భాగమని పేర్కొంది. క్యాంపెయిన్ ప్రారంభం అయినప్పటి నుంచి 6.85 లక్షల స్కూళ్లు, 6.80 లక్షల అంగన్‌వాడీ సెంటర్లు, 2.36 లక్షల గ్రామ పంచాయతీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కొళాయిలు ఏర్పాటు అయినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment