వెలుగు చూసిన గుహ, ప్రాచీన వస్తువులు
దొడ్డబళ్లాపురం: మాగడి తాలూకాలో మఠానికి చెందిన భూమిలో తవ్వకాలు జరుపుతుండగా ప్రాచీన వస్తువులు బయటపడడం ఆసక్తిగా మారింది. మాగడి తాలూకా కన్నూరు గ్రామంలో మక్కళ దేవర మఠంలో మఠానికి చెందిన భూమిలో వ్యవసాయ పనుల నిమిత్తం జేసీబీతో తవ్విస్తుండగా హఠాత్తుగా భూమి లోపలకు కూలిపోయింది. దీంతో అక్కడ తవ్వి చూడగా ఒక గుహ, ప్రాచీన కాలం నాటి ఇత్తడి, తామ్రం, మట్టి వస్తువులు లభించాయి.
తట్టలు, దీపం స్తంభాలు, విభూధి ఉండలు, ఉయ్యాల స్తంబం, గంట తదితర వస్తువులు వెలుగుచూసాయి. గతంలో మఠానికి చెందిన స్వామీజీ ఒకరు సజీవ సమాధి అయ్యారని, ఆయన వస్తువులు కూడా సమాధిలో ఉండిపోయి ఇప్పుడు వెలుగు చూసాయని మఠం నిర్వాహకులు తెలిపారు. పోలీసులు పురాతత్వ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment