కన్నడిగులపై అనుచిత వ్యాఖ్యలు | Bangalore Woman Has Been Fired From Her Job After Remark On North Indians Do Leave The City, See Details | Sakshi
Sakshi News home page

కన్నడిగులపై అనుచిత వ్యాఖ్యలు

Published Wed, Sep 25 2024 7:06 AM | Last Updated on Wed, Sep 25 2024 8:46 AM

 Bangalore has been fired from her job

యువతిని ఉద్యోగం నుంచి తొలగించిన వైనం

దొడ్డబళ్లాపురం: రాజధాని బెంగళూరు నుండి ఉత్తర భారతీయులు వెళ్లిపోతే బెంగళూరు ఖాళీ అవుతుందని ఇన్‌స్టాలో రీల్స్‌ చేస్తూ అవమానకరంగా మాట్లాడిన ఉత్తర భారత యువతిని ఆమె పని చేస్తున్న కంపెనీ నుండి తొలగించారు. ఉత్తర భారత్‌కు చెందిన సుగంధ శర్మ అనే యువతి ఇటీవల రీల్స్‌ చేసి నార్త్‌ ఇండియన్స్‌ బెంగళూరు వదిలి పోతే బెంగళూరు ఖాళీ అవుతుందని, కన్నడిగులు కొన్ని విషయాలలో మరీ ఎక్కువ చేస్తారని వ్యంగ్యంగా మాట్లాడింది. 

పీజీలు ఖాళీ అవుతాయని, కోరమంగలలో అన్ని క్లబ్‌లు మూసుకోవాలని, అందమైన ఆడపిల్లలు చేసే పంజాబీ నృత్యాలు మిస్‌ అవుతారని వెటకారంగా మాట్లాడింది. మేమంతా వెళ్లిపోతే బెంగళూరు కనుమరుగు అవుతుందని వ్యాఖ్యలు చేసింది.

దీంతో కన్నడిగులు తక్షణం బెంగళూరు వదిలిపోవాలని ఆమెకు కౌంటర్‌ ఇచ్చారు. సదరు రీల్‌ గంటల్లోనే వైరల్‌గా మారింది. దీంతో కంపెనీ వారు ఆమెను ఉద్యోగంలోంచి తొలగించారని సమాచారం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement