10 మంది సీఎంల గైర్హాజరు
నీతిఆయోగ్ భేటీకి విపక్ష ఇండియా కూటమి సీఎంలతో పాటు పాలక ఎన్డీఏ సంకీర్ణంలో కీలక భాగస్వామి అయిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా డుమ్మా కొట్టడం విశేషం. ఆయన బదులు ఉప ముఖ్యమంత్రులు సమర్థ్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పాల్గొన్నారు. ఆయన కోరుతున్నట్టుగా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం ఇటీవలే స్పష్టం చేయడం తెలిసిందే. దీనిపై అసంతృప్తితోనే భేటీకి నితీశ్ దూరంగా ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే ఆయన గైర్హాజరుకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదని జేడీ(యూ) పేర్కొంది. గతంలో కూడా నితీశ్ పలుమార్లు నీతిఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారని గుర్తు చేసింది.
కేంద్ర బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆరోపిస్తూ తెలంగాణ, కర్నాటక తమిళనాడు, కేరళ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, పాండిచ్చేరి సీఎంలు కూడా భేటీకి దూరంగా ఉన్నారు. ‘‘10 రాష్ట్రాల సీఎంలు భేటీకి రాలేదు. అది ఆయా రాష్ట్రాలకే నష్టం’’ అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం అన్నారు. ‘‘మమత సమయం పూర్తవగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మైక్‌పై తట్టారు. వెంటనే ఆమె మాట్లాడటం ఆపేసి వాకౌట్ చేశారు’’ అని ఆయన వివరించారు. బిహార్ అసెంబ్లీ సమావేశాల కారణంగా నితీశ్ రాలేకపోయారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment