
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా కరోనా వైరస్ బారిన పడి కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావటంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి జీనా ఆరోగ్యపరిస్థితి బాగా క్షిణించి తుది శ్వాస విడిచారు. 1969 డిసెంబర్ 8న అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో ఆయన జన్మించారు. 2007లో మొదటి సారి బిక్యాసెన్ నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సాల్ట్ నియోజవర్గంనుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొద్దిరోజుల క్రితం ఆయన భార్య గుండెపోటు కారణంగా మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment