న్యూఢిల్లీ: బిభవ్ కుమార్‌తో రాజీనామా చేస్తారా? లేదంటే అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ వెల్లడించిన తరుణంలో బీజేపీ స్పందించింది.
సీఎం పదవికి రాజీనామా చేయాలి
బిభవ్ కుమార్‌తో రాజీనామా చేయించాలని, లేదంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ డిమాండ్ చేశారు. స్వాతి మలివాల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఇల్మీ.. కేజ్రీవాల్ బెదిరింపులకు గురిచేస్తున్నారా అని ప్రశ్నించారు.
మహిళా ఎంపీపై దాడి జరిగితే మౌనమేలా
మరోవైపు ఓ మహిళా ఎంపీపై దాడి జరిగినా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గేతో పాటు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ అంశంపై మౌనం వహించడాన్ని తప్పుబట్టారు.
ఆమ్ ఆద్మీ పార్టీ గురించి
కేజ్రీవాల్ అధికారిక నివాసంలో తనపై దాడి జరిగిందని మలివాల్ సోమవారం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదునే ఇల్మీ ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ నివాసంలో ఆమెను కొట్టినట్లు స్పష్టంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి (ఇల్మీ గతంలో ఆప్‌లో పనిచేశారు) నాకు బాగా తెలుసని అన్నారు.
బిభవ్‌తో రాజీనామా చేయించాలి. లేదంటే తనకు తానే రాజీనామా చేయాలని అరవింద్ కేజ్రీవాల్‌ను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ నొక్కాణించారు.
Comments
Please login to add a commentAdd a comment