వన్ నేషన్, వన్ సబ్ స్క్రిప్షన్‌కు ఓకే
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో 7.5 లక్షల హెక్టార్లలో సహజ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,481 కోట్లతో జాతీయ మిషన్ ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా కోటి మంది రైతులను సహజసాగు దిశగా ప్రోత్సహించనున్నారు. రీసెర్చి వ్యాసాలు, జర్నళ్లను దేశవ్యాప్తంగా ఔత్సాహికులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు రూ.6,000 కోట్లతో తలపెట్టిన ‘వన్ నేషనల్, వన్ సబ్ స్క్రిప్షన్’ పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇతర నిర్ణయాలు...
→ రూ.7,927 కోట్లతో పలు రైల్వే ప్రాజెక్టులు
→ అరుణాచల్‌ప్రదేశ్‌లో రూ.3,689 కోట్లతో 2 హైడ్రో ప్రాజెక్టులు
→ అటల్ ఇన్నొవేషన్ మిషన్ కొనసాగింపు. దాని రెండో దశకు రూ.2,750 కోట్లు
→ పాన్ 2.0 ప్రాజెక్టుకు రూ.1,435 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment