
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సాయుధ బలగాల కమాండర్‌ను దారుణంగా చంపారు. కుట్రు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దర్బా గ్రామంలో ఆదివారం జరిగే సంతకు ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాల 4వ బెటాలియన్ జవాన్లు బందోబస్తుగా ఉన్నారు.
ఉదయం 9.30 గంటల సమయంలో గ్రామీణుల వేషధారణలో వచి్చన మావోయిస్టులు ఏమరుపాటుగా ఉన్న కమాండర్ తేజో రాం బౌర్యా తలపై గొడ్డలితో వేటు వేశారు. దీంతో, ఆయన అక్కడికక్కడే కుప్పకూలి, ప్రాణాలొదిలారు. ఆ వెంటనే మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న బలగాలు మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు.