Bijapura district
-
సీఏఎఫ్ కమాండర్‌ను పొట్టనబెట్టుకున్న మావోలు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సాయుధ బలగాల కమాండర్‌ను దారుణంగా చంపారు. కుట్రు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దర్బా గ్రామంలో ఆదివారం జరిగే సంతకు ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాల 4వ బెటాలియన్ జవాన్లు బందోబస్తుగా ఉన్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో గ్రామీణుల వేషధారణలో వచి్చన మావోయిస్టులు ఏమరుపాటుగా ఉన్న కమాండర్ తేజో రాం బౌర్యా తలపై గొడ్డలితో వేటు వేశారు. దీంతో, ఆయన అక్కడికక్కడే కుప్పకూలి, ప్రాణాలొదిలారు. ఆ వెంటనే మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న బలగాలు మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. -
వరదల్లో కొట్టుకుపోయిన లారీ.. రేషన్ బియ్యం నీటిపాలు
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముసురు కారణంగా పలు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు సైతం రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ విధించారు. రాష్ట్రంలో విద్యా సంస్థలకు సైతం మూడు రోజులు పాటు సెలవులు ఇస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో ఓ లారీ వర్షపు నీటి వరదలో కొట్టుకుపోయింది. కాగా, రేషన్ బియ్యం తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో టన్నుల సంఖ్యలో రేషన్ బియ్యం నీటిపాలైంది. అయితే, లారీ డ్రైవర్.. వరద పరిస్థితిని సరిగా అంచనా వేయకుండా లారీని ముందుకు పోనిచ్చాడు. వరద ఉద్ధృతికి ఆ లారీ నీటిలో కొట్టుకుపోయింది. అయితే, మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. छत्तीसगढ़ के बीजापुर में पीडीएस का चावल ले जा रहा ट्रक उफनती नदी में बहा, देखें वीडियो#Bijapur #TruckFallInRiver #ViralVideo #Rainfall #weather #Chhattisgarh pic.twitter.com/8TSSynSmsV — Neo News Mathura (@Neo_NeoNews) July 10, 2022 ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. మూడు రోజులు స్కూల్స్ బంద్ -
ఇక్కడొద్దు...
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజాపుర జిల్లా ఆల్మట్టిలో వాయనం సమర్పించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గురువారం అక్కడ రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. పక్కనే ఉన్న బాగలకోటె జిల్లా కూడగిలో థర్మల్ విద్యుత్కేంద్రాన్ని నెలకొల్పుతున్నందుకు నిరసనగా రైతులందరూ ఆకు పచ్చ కండువాలను పైకి ఊపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో అక్కడ గుమికూడిన రైతులు చెరుకు మద్దతు ధరను రూ.2,500గా నిర్ణయించాలని కూడా డిమాండ్ చేశారు. రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుందని ముందుగానే పసిగట్టిన పోలీసులు కూడా అక్కడ భారీ సంఖ్యలో మోహరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులను అనునయించడానికి ప్రయత్నించారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నందున, ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తే ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. చెరుకు మద్దతు ధరను ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిందని గుర్తు చేశారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే రైతు సంఘాల ప్రతినిధులు తనను సంప్రదించవచ్చని సూచించారు. అనంతరం ఆయన ఆల్మట్టి జలాశయంలో కృష్ణమ్మకు వాయనం సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేపీఎస్సీ నియామకాల రద్దును సమర్థించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపై పునరాలోచన లేదని స్పష్టం చేశారు. నియామకాలకు సంబంధించి కేపీఎస్సీ సభ్యులు కొందరికి ముడుపులు అందాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేది లేదని తెలిపారు. రాష్ట్ర పరిధిలో దీనిపై అనుసరించాల్సిన విధి విధానాలు ఉన్నాయని, వాటిని పాటిస్తామని ఆయన చెప్పారు.