సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ చంద్రుడికి మరింత చేరువయ్యే సమయంలో ల్యాండర్ మాడ్యూల్‌లో అమర్చిన ‘‘ల్యాండర్ హారిజెంటల్ వెలాసిటీ కెమెరా’’(ఎల్‌హెచ్‌వీసీ) రెండు ఛాయా చిత్రాలను తీసి పంపింది. వాటిని ఇస్రో తన వెబ్‌సైట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈనెల 6న ఎల్‌హెచ్‌వీసీ ఇనుస్ట్రుమెంట్ చంద్రుడ్ని తీసిన వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
తాజాగా లూనార్ కక్ష్యలో నుంచి చంద్రుడ్ని వీడియోతో పాటు ఛాయా చిత్రాలు తీయడం విశేషం. ప్రయోగం రోజున అంటే గత నెల 14న ‘‘ల్యాండర్ ఇమేజర్ కెమెరా’’భూమిని తీసిన ఛాయాచిత్రాలను కూడా గురువారం విడుదల చేసింది. చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాల కంటే చంద్రయాన్–3 మిషన్‌లో అత్యంత హై రిజల్యూషన్ కెమెరాలను అమర్చినట్టుగా తెలుస్తోంది.
ఈ రెండు చాయా చిత్రాలతో పాటుగా 14 సెకన్లపాటు తీసిన వీడియో కూడా ఎంతో స్పష్టతతో కూడి ఉండడం విశేషం. మరో 13 రోజుల్లో చంద్రయాన్–3 మిషన్ చంద్రుడి ఉపరితలంపై దిగడంతో ప్రయాణం పూర్తవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment