సాక్షి, ఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రి ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో, వైద్యసేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ స్పందిస్తూ.. వైద్యులు తమ ఆందోళనను విరమించాలని కోరింది.
వివరాల ప్రకారం.. ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. వైద్యులు ఆసుపత్రుల్లో వైద్యసేవలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో వైద్యులు తమ ఆందోళన విరమించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. ఈ సందర్భంగా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ భద్రతకు తగిన చర్యలు చేపడతామని కేంద్రం హామీ ఇచ్చింది. అలాగే, వైద్యుల భద్రతకు కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది.
#WATCH | Doctors stage a protest at Delhi’s Lady Hardinge Medical College against the rape-murder incident at Kolkata's RG Kar Medical College and Hospital pic.twitter.com/yf06mkCSpj
— ANI (@ANI) August 17, 2024
ఇదే సమయంలో వైద్య రంగానికి సంబంధించిన అన్ని వర్గాలతో సంప్రదించి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సిఫారసు చేయనుంది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment