
సాక్షి, చండీగఢ్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ విధి నిర్వహణలో మహిళల నిబద్ధతకు సంబంధించి ఒక వీడియో నెట్టింట్ సందడి చేస్తోంది. మండుటెండలో చంటి బిడ్డను ఎత్తుకొని మరీ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న ప్రియాంక అనే మహిళా పోలీసుపై సోషల్‌మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. కావాలనుకుంటే ఇంటికి వెళ్ళమని ఇతర సిబ్బంది ఆమెను కోరినప్పటికీ, ఆమె తన విధిని కొనసాగించడం విశేషంగా నిలిచింది. ‘‘అటు మాతృత్వం, ఇటు కర్తవ్యం’’ పేరుతో షేర్ అవుతున్న ఈ వీడియో వైరల్ అవుతోంది. హ్యట్సాఫ్ అంటూ నెటిజన్లు ప్రియాంకను అభినందిస్తున్నారు. మరోవైపు బిడ్డను పోషించాల్సిన తరుణంలో ఆమె విధి నిర్వర్తించాల్సి రావడం దురదృష్టకరమని మరికొంతమంది వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment