రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ సింగ్ మాండవి ఆదివారం గుండెపోటుతో మరణించారు. 58 ఏళ్ల మాండవి తన స్వగ్రామమైన నాథియా నవాగావ్‌లో శనివారం రాత్రి ఆయన అశ్వస్థతకు గురయ్యినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయన్ని హుటాహుటిన చరమలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అనంతరం ధామ్‌తరి పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కంకేర్ జిల్లాలోని భానుప్రతాప్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాండవి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేగాదు మాండవి 2000 నుంచి 2003 వరకు అజిత్‌జోగి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రిగానూ, జైళ్ల సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ మఖ్యమంత్రి భూపేస్ బాగెల్ మాండవి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గిరిజనుల కోసం చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.
(చదవండి: అబుదాబి పోలీసుల నిర్బంధంలో నోయిడా వ్యక్తి... ఆ తర్వాత...)
Comments
Please login to add a commentAdd a comment