deputy speker
-
చత్తీస్‌గఢ్ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ సింగ్ మాండవి ఆదివారం గుండెపోటుతో మరణించారు. 58 ఏళ్ల మాండవి తన స్వగ్రామమైన నాథియా నవాగావ్‌లో శనివారం రాత్రి ఆయన అశ్వస్థతకు గురయ్యినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయన్ని హుటాహుటిన చరమలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ధామ్తరి పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కంకేర్ జిల్లాలోని భానుప్రతాప్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాండవి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేగాదు మాండవి 2000 నుంచి 2003 వరకు అజిత్‌జోగి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రిగానూ, జైళ్ల సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ మఖ్యమంత్రి భూపేస్ బాగెల్ మాండవి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గిరిజనుల కోసం చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. (చదవండి: అబుదాబి పోలీసుల నిర్బంధంలో నోయిడా వ్యక్తి... ఆ తర్వాత...) -
క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయికి..
సాక్షి, సిటీబ్యూరో: మాజీ మంత్రి పద్మారావుకు మరో ఉన్నత పదవి దక్కింది. 1986లో మోండా డివిజన్ నుంచి కార్పోరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పద్మారావు ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ఇక ఇప్పుడు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించనున్నారు. ఆయన ఎన్నిక దాదాపు లాంఛనమే అయినా, శనివారం నామినేషన్ వేయనున్నారు. ఇదిలా ఉండగా మోండా మార్కెట్ కేంద్రంగానే పద్మారావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1986 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పద్మారావు విజయం సాధించగా, జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన శ్రీనివాస్ యాదవ్ ఓటమి పాలయ్యారు. దివంగత నేత పీజేఆర్‌కు ప్రధాన అనుచరుడిగా కొనసాగిన పద్మారావు 1999 ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత 2001లో టీఆర్ఎస్లో చేరి 2002లో మరోసారి మోండా డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా బరిలో దిగి... ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై గెలుపొందారు. 2008లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన... అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో తలసానిపై ఓడిపోయారు. 2009లో పొత్తుల్లో భాగంగా మహాకూటమి అభ్యర్థిగా సనత్‌నగర్ నుంచి పోటీ చేసిన పద్మారావు... మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి దాదాపు 45వేల మెజారీటీతో విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా సాదాసీదా జీవితం గడిపే పద్మారావు... తాను పుట్టి పెరిగిన టకారా బస్తీలోనే ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో బంగళా ఇచ్చినా తాను అమితంగా ఇష్టపడే బస్తీలోనే ఉంటూ తన వాళ్ల మధ్యే గడుపుతుండడం విశేషం. -
రాజకీయాలు శాశ్వతం కాదు
ఫొటోస్లగ్07పిఏఎం51 : మాట్లాడుతున్న మండలి బుద్ధప్రసాద్ కూచిపూడి : రాజకీయాలు శాశ్వతం కాదని, అభివృద్ధే ముఖ్యమని డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కూచిపూడిని దత్తత తీసుకొని పలు అభివృద్ధి పనులు చేపట్టిన సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ అభినందనీయులని పేర్కొన్నారు. కూచిపూడిలో సిలికానాంధ్ర ఆధ్వర్యాన నిర్మించనున్న 200 పడకల సంజీవని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఆదివారం బుద్ధప్రసాద్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో ఈర్షా్య ద్వేషాలు తగదన్నారు. కూచిబొట్ల ఆనంద్ మాట్లాడుతూ లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు విరాళం ఇవ్వొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న డాక్టర్ ప్రపుల్లారెడ్డి, డాక్టర్ పాపారావు, డాక్టర్ అమ్మన్న తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీపీ కిలారపు మంగమ్మ, గ్రామ సర్పంచ్ కందుల జయరాం, వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర, మాజీ సర్పంచిలు వైకేడీ ప్రసాదరావు, పెనుమూడి కాశీవిశ్వనాథం, మద్దాలి నాగభూషణం, డాక్టర్ కోటంరాజు స్మృతి, డాక్టర్ చికిర్ష, చింతలపూడి జ్యోతి పాల్గొన్నారు.