రాజకీయాలు శాశ్వతం కాదు | devlopement first | Sakshi
Sakshi News home page

రాజకీయాలు శాశ్వతం కాదు

Published Sun, Aug 7 2016 11:10 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

రాజకీయాలు శాశ్వతం కాదు - Sakshi

రాజకీయాలు శాశ్వతం కాదు

 ఫొటోస్లగ్‌07పిఏఎం51 : మాట్లాడుతున్న మండలి బుద్ధప్రసాద్‌
 
కూచిపూడి : 
రాజకీయాలు శాశ్వతం కాదని, అభివృద్ధే ముఖ్యమని డెప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. కూచిపూడిని దత్తత తీసుకొని పలు అభివృద్ధి పనులు చేపట్టిన సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్‌ అభినందనీయులని పేర్కొన్నారు. కూచిపూడిలో సిలికానాంధ్ర ఆధ్వర్యాన నిర్మించనున్న 200 పడకల సంజీవని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ పనులను ఆదివారం బుద్ధప్రసాద్‌ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో ఈర్షా్య ద్వేషాలు తగదన్నారు. కూచిబొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్‌ నిర్మిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు విరాళం ఇవ్వొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న డాక్టర్‌ ప్రపుల్లారెడ్డి, డాక్టర్‌ పాపారావు, డాక్టర్‌ అమ్మన్న తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీపీ కిలారపు మంగమ్మ, గ్రామ సర్పంచ్‌ కందుల జయరాం, వైస్‌ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర, మాజీ సర్పంచిలు వైకేడీ ప్రసాదరావు, పెనుమూడి కాశీవిశ్వనాథం, మద్దాలి నాగభూషణం, డాక్టర్‌ కోటంరాజు స్మృతి, డాక్టర్‌ చికిర్ష, చింతలపూడి జ్యోతి పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement