పాట్నా: లోక్‌సభకు ముందస్తుగానే ఎన్నికలు జరుగుతాయని, ఈ ఏడాదే జరిగినా ఆశ్చర్యం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పనులను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2024 జనవరి కంటే ముందే ఈ పనులు పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ఆదేశించానని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలియదని, కచ్చితంగా వచ్చే ఏడాదే జరగాలన్న నియమం ఏమీ లేదని, ముందుగానే జరిగే అవకాశాలున్నాయని, ఈ ఏడాదే జరగొచ్చని, అలా జరగడం సాధ్యమేనని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదని అధికారులకు నితీశ్ సూచించారు. పనులన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తయితే తాను సంతోషిస్తానని పేర్కొన్నారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించారని, ఇప్పుడు దాన్ని 60 శాతానికి తగ్గించారని ఆక్షేపించారు. 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపుతున్నారని చెప్పారు. ‘ప్రధానమంత్రి సడక్ యోజన’ అని పేరుపెట్టిన పథకానికి కేంద్రం 60 శాతం నిధులే ఇస్తోందన్నారు. ఈ నెల 23న పాట్నాలో జరగబోయే ప్రతిపక్షాల కీలక సమావేశంలో ముందస్తు ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారంముందస్తు ఎన్నికలు వస్తాయన్న నితీశ్ కుమార్ వ్యాఖ్యలను బిహార్ బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ కొట్టిపారేశారు. నితీశ్ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారని, ఊహాగానాల్లో జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు.
#WATCH | I have always been saying that the (Lok Sabha) elections should be conducted early. It is better if the polls are conducted early. Nobody knows when the elections will be conducted, so I request to do it as early as possible: Bihar CM Nitish Kumar
— ANI (@ANI) June 14, 2023
(Source: IPRD Bihar) pic.twitter.com/gQOVHJEIVI
ఇది కూడా చదవండి: బెంగాల్ పంచాయతీ ఎన్నికల నామినేషన్లో ఉద్రిక్తత..
Comments
Please login to add a commentAdd a comment