
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా రచితా తనేజ కార్టూనిస్ట్ వ్యవహరించారని అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. ఇది కోర్టు ధిక్కార చర్యని, సర్వోన్నత న్యాయవ్యవస్థను అవమానించడమేనని తెలిపారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేసిన విషయమై రచిత సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ఒక కార్టూన్‌ను ట్వీట్ చేశారు. దీంతో ఆమెపై కోర్టు ధిక్కార చర్యలకు అటర్ని జనరల్ అనుమతించారు. (చదవండి: కోవిడ్ పేషెంట్లను అంటరాని వారిగా చూస్తున్నారు)
2018లో ఆర్కిటెక్ అన్వే నాయక్, అతని తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయమై అర్నబ్ గోస్వామి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన వారం రోజులకే మధ్యంతర బెయిల్‌పై అర్నబ్ బయటకు వచ్చారు. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, ఇందిరా బెనర్టీలతో కూడిన ధర్మాసనం జర్నలిస్ట్‌కు బెయిల్ మంజూరు చేసింది.
భారతీయ హస్య నటుడు కునాల్ కమ్రా సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలపై విచారణ ప్రారంభించారు. గోస్వామికి మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై కునాల్ కమ్రా సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అతడి కోర్టు ధిక్కార చర్యలకు అనుమతించాలని 8 మంది కోరగా అటర్నీ జనరల్ అనుమతించారు. 'ప్రస్తుతం ప్రజలు ధైర్యంగా ఏది పడితే అది సుప్రీంకోర్టును, న్యాయమూర్తులను అంటున్నారు. అది వాక్ స్వాతంత్ర్యంగా వారు భావిస్తున్నారు. సుప్రీం కోర్టుపై ఈ రకంగా దాడి చేసిన వారికి శిక్ష పడుతుందని మరిచిపోతున్నార'ని కేకే వేణుగోపాల్ అన్నారు. (చదవండి: లైంగిక వేధింపులు..ఆపై కాల్పులు)
Comments
Please login to add a commentAdd a comment